News December 2, 2024

RRR రికార్డును పుష్ప-2 బ్రేక్ చేస్తుందా?

image

రిలీజైన తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా ‘RRR’ (₹223కోట్లు) పేరిట రికార్డు ఉంది. మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ‘పుష్ప-2’ ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకు సౌత్‌తో పాటు నార్త్‌లో ఉన్న క్రేజ్, టికెట్ల ధరల పెంపు దృష్ట్యా ఓపెనింగ్ డే వసూళ్లు ₹250CR-₹300CR మధ్యలో రావొచ్చని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.

Similar News

News March 5, 2026

10 సార్లు సీఎం.. ఇక శకం ముగిసినట్లే!

image

బిహార్‌లో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు నితీశ్ పేరిట ఉంది. ఏకంగా 10 సార్లు ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి 2000 సం.లో కేవలం 7 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2005, 10, 15 (2 సార్లు), 17, 20, 22, 24, 25లో CM కుర్చీ ఎక్కారు. OBCలు, మహిళల మద్దతుతో పాటు వివిధ పార్టీలతో పొత్తుల ద్వారా ఎక్కువ కాలం సీఎంగా కొనసాగారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్‌లో ఆయన శకం ముగిసినట్లే భావించాలి.

News March 5, 2026

ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

image

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.

News March 5, 2026

హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

image

HYDలోని<> CCMB<<>> 3 Sr. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది . అర్హతగల వారు మార్చి 17న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PG(నేచురల్ సైన్స్), BE/BTech, MBBS, ఫార్మసీ, PhD(బయోఇన్ఫర్మాటిక్స్/ జెనిటిక్స్/ లైఫ్ సైన్స్), డిగ్రీ(మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, వైరాలజీ, మాలిక్యులార్ బయాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. సైట్: www.ccmb.res.in