News November 27, 2024

క్విక్ కామర్స్.. కిరాణా షాపులకు దెబ్బేనా?

image

10 నిమిషాల్లోపే డెలివరీ చేసే క్విక్ కామర్స్ వ్యాపారం దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మినట్స్, బిగ్ బాస్కెట్, ఫోన్ పేకి చెందిన పిన్‌కోడ్, జియో మార్ట్ ఉండగా అమెజాన్ కూడా Tez పేరుతో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్విక్ కామర్స్ వల్ల కిరాణా షాపులకు ముప్పు కలిగే ఛాన్స్ ఉందని వ్యాపార వర్గాల అంచనా.

Similar News

News November 27, 2024

RGV కోసం పోలీసుల ముమ్మర గాలింపు

image

సోషల్ మీడియాలో పోస్టుల కేసులో డైరెక్టర్ RGV కోసం AP పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పలు బృందాలుగా ఏర్పడి తెలంగాణ, తమిళనాడు, కేరళలో వెతుకుతున్నారు. కాగా ఆర్జీవీ నిన్న ఓ వీడియో విడుదల చేశారు. తాను భయపడి పారిపోలేదని, సినిమా షూటింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది.

News November 27, 2024

కేంద్ర మంత్రితో పవన్ భేటీ.. ఎర్రచందనంపై చర్చ

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. ఎర్రచందనం పరిరక్షణపై చర్చించారు. ఏపీ, తమిళనాడులో ఎర్ర చందనం పెరుగుదల, స్వాధీనం చేసుకున్న కలపను ఈ-వేలం వేయడానికి రాష్ట్ర అటవీ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించడం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన కలపను రాష్ట్రానికి తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.

News November 27, 2024

మరో ఇండో-అమెరికన్‌కు ట్రంప్ కీలక పదవి

image

US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి కట్టబెట్టారు. Dr.జయ్ భట్టాచార్యను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమించారు. దీంతో అత్యున్నత పరిపాలన స్థానానికి ట్రంప్ నామినేట్ చేసిన తొలి ఇండో-అమెరికన్‌గా జయ్ నిలిచారు. కోల్‌‌కతాలో జన్మించిన ఆయన స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ట్రంప్ ఇటీవల వివేక్ రామస్వామిని DOGE అధిపతిగా నియమించారు.