News June 14, 2024
నీట్ స్కామ్ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం: YCP MP

NEET UG పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్రం స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని YCP తిరుపతి MP మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ‘తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్యూచర్ డాక్టర్లు రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై NTA, కేంద్ర వైద్యారోగ్యశాఖ, అమిత్‌షా దృష్టిసారించి త్వరగా పరిష్కరించాలి. దేశం & ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాన్ని మేము పార్లమెంటులో లేవనెత్తుతాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


