News October 25, 2024
బలంగా ప్రతిస్పందిస్తాం: మోర్నే మోర్కెల్

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్రస్తుతానికి వెనుకబడినా మళ్లీ పుంజుకుంటుందని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం బౌలర్లు శ్రమించి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయాలి. అక్కడక్కడా మేం తడబడ్డాం. కానీ ఈ బృందం పోరాటాన్ని ఆపదు. ప్రతి అవకాశాన్నీ ఒడిసిపట్టి తిరిగి పుంజుకుంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 18, 2025
హైడ్రా పేరుతో వసూళ్ల దందా: కేటీఆర్

TG: హైడ్రా పేరుతో వసూళ్ల దందా నడుస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కుటుంబం రియల్ వ్యాపారం చేస్తోందని విమర్శలు చేశారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటారని దుయ్యబట్టారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లారన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలన్నారు.
News March 18, 2025
హౌతీల వల్ల నెలకు 800 మిలియన్ డాలర్ల నష్టం: ఈజిప్ట్

సూయజ్ కెనాల్లో నౌకల్ని హౌతీ రెబెల్స్ అడ్డుకుంటుండటం వల్ల తమకు నెలకు 800 మిలియన్ డాలర్ల నష్టం వస్తోందని ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కాగా.. యెమెన్‌లోని హౌతీలపై అమెరికా ముమ్మర దాడుల్ని కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 24మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వారిలో 9మంది పౌరులున్నారని యెమెన్ ఆరోగ్యశాఖ చెబుతోంది.
News March 18, 2025
నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

TG: ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.