News July 29, 2024

అణ్వాయుధాల తయారీని పునఃప్రారంభిస్తాం: పుతిన్

image

జర్మనీలో లాంగ్ రేంజ్ క్షిపణులను మోహరిస్తామని US చెప్పడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘాటుగా స్పందించారు. అలాంటి ఆలోచన వారికి ఉంటే తాము కూడా మిడిల్, షార్ట్ రేంజ్ అణ్వాయుధాల తయారీని పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తీర ప్రాంతంలో బలగాలను మరింత పెంచడంపైనా దృష్టి సారిస్తామని చెప్పారు. కాగా మధ్యస్థ శ్రేణి ఆయుధాలను మోహరించడాన్ని నిషేధిస్తూ అమెరికా-సోవియట్‌ యూనియన్‌లు 1987లో ఒప్పందం చేసుకున్నాయి.

Similar News

News December 11, 2024

రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త విధానం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడమే పాలసీ ముఖ్య ఉద్దేశమంది. ఎకో, క్రూయిజ్, బ్యాక్ వాటర్ టూరిజం, బీచ్ సర్క్యూట్‌లను ప్రోత్సహించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీ రూపొందించినట్లు వివరించింది.

News December 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 11, 2024

మోహన్‌బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశం

image

TG: హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.