News June 14, 2024
అంకితభావంతో సేవ చేస్తా: మంత్రి సత్యకుమార్ యాదవ్
AP: రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక శాఖలు దక్కడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం&వైద్య విద్య శాఖలు నాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ పెద్దలు, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞుడను. ప్రజలకు అంకితభావంతో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నా. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 19, 2024
INDvsBAN: నేటి నుంచే తొలి టెస్టు
చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు నేడు ప్రారంభం కానుంది. సొంత గడ్డపై 2012 నుంచి టెస్టు సిరీస్ ఓడని IND తన ఖాతాలో మరో సిరీస్‌ను వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. పాక్‌ను వైట్‌వాష్ చేసిన ఊపులో ఉన్న బంగ్లా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటోంది. ఉ.9.30 నుంచి స్పోర్ట్స్18లో వీక్షించవచ్చు.
IND అంచనా టీమ్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా
News September 19, 2024
బాలికలపై లైంగిక వేధింపులు.. వార్డెన్ సస్పెండ్
AP: ఏలూరులోని ఓ ఆశ్రమ హాస్టల్‌లో బాలికలపై లైంగిక వేధింపులకు <<14129113>>పాల్పడిన<<>> గ్రేడ్-2 సంక్షేమాధికారి శశికుమార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ప్రాథమిక దర్యాప్తు చేయించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం శశికుమార్, అతడికి సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదుచేస్తామని చెప్పారు.
News September 19, 2024
మద్యం షాపు దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు
AP: నూతన మద్యం పాలసీలో భాగంగా 3,736 లిక్కర్ షాప్‌లలో 10 శాతం(340) గీత కార్మికులకు రిజర్వ్ చేస్తారు. దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు. లాటరీ విధానంలో రెండేళ్ల కాలపరిమితితో షాపులు కేటాయిస్తారు. ఉ.10 నుంచి రా.10 వరకు షాపులకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజు రూ.50-85 లక్షలు చెల్లించాలి. 12 ప్రధాన పట్టణాల్లో 12 ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అదనంగా ఫీజు నిర్ణయిస్తారు.