News January 25, 2025
నేడు షమీ ఆడతారా?

భారత స్టార్ బౌలర్ షమీ నేడు ఇంగ్లండ్‌తో జరిగే 2వ T20 ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న షమీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశారు. అయితే మోకాలికి బ్యాండేజ్ వేసి ఉండటంతో మ్యాచ్ ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి T20 ఆడతారని భావించినా డగౌట్‌కే పరిమితమయ్యారు. అటు షమీ ఆరోగ్య పరిస్థితిపై BCCI ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం షమీ ఆడాలని కోరుకుంటున్నారు.
Similar News
News February 15, 2025
పెన్సిల్ ఎత్తినా వర్కౌట్‌లా ఉంటుంది.. సునీత, విల్మోర్‌కు ఇబ్బందులు

సుమారు 8 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు వచ్చేనెల భూమిపైకి రానున్నారు. అయితే జీరో గ్రావిటీ ఉండే స్పేస్ నుంచి గురుత్వాకర్షణ కలిగిన భూమిపైకి వచ్చాక వారికి అనేక ఇబ్బందులు ఎదురవనున్నాయి. చిన్న పెన్సిల్ ఎత్తినా అది వర్కౌట్‌తో సమానమవుతుందని విల్మోర్ తెలిపారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం చాలా కష్టంగా ఉంటుందని సునీత చెప్పారు.
News February 15, 2025
రోహిత్ శర్మకు షాక్.. WTCలో బుమ్రానే కెప్టెన్?

రోహిత్ శర్మను ఇకపై టెస్టులకు BCCI పరిగణనలోకి తీసుకోకపోవచ్చని PTI వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త WTC సీజన్‌లో బుమ్రానే కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూన్-జులైలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదని, ముందు జాగ్రత్తగానే NCAకి పంపినట్లు వార్తలు వస్తున్నాయి.
News February 15, 2025
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులు, MLA కోటా MLC పదవులు సహా మరికొన్ని అంశాలపై ఆయనతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం.