News December 4, 2024

పవన్‌తో దిగిన సెల్ఫీ షేర్ చేస్తా: హీరోయిన్ నిధి

image

‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న వేళ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు నిర్మాత SKN ఓ రిక్వెస్ట్ చేశారు. గత వారం జరిగిన షూటింగ్‌లో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకోవాలని ఆయన ఆమెను Xలో కోరారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మై డియర్ రాక్‌స్టార్. పవన్ గారితో నేను తీసుకున్న మొదటి సెల్ఫీని త్వరలో పోస్ట్ చేస్తా’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం పవన్ సైతం HHVM షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Similar News

News January 21, 2026

కొనసాగిన నష్టాలు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకొని చివరికి 270 పాయింట్ల నష్టంతో 81,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 25,157 వద్ద సెటిల్ అయింది.

News January 21, 2026

అమరావతికి చట్టబద్ధత.. పార్లమెంటులో బిల్లు!

image

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపైనా నోట్ ఇచ్చింది. కాగా ఏ తేదీ నుంచి రాజధానిగా గుర్తించాలో చెప్పాలని కేంద్రం కోరినట్లు సమాచారం.

News January 21, 2026

గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

image

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.