News December 4, 2024
పవన్‌తో దిగిన సెల్ఫీ షేర్ చేస్తా: హీరోయిన్ నిధి
‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న వేళ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు నిర్మాత SKN ఓ రిక్వెస్ట్ చేశారు. గత వారం జరిగిన షూటింగ్‌లో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకోవాలని ఆయన ఆమెను Xలో కోరారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మై డియర్ రాక్‌స్టార్. పవన్ గారితో నేను తీసుకున్న మొదటి సెల్ఫీని త్వరలో పోస్ట్ చేస్తా’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం పవన్ సైతం HHVM షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
Similar News
News January 26, 2025
కుంభమేళా.. నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వేలసంఖ్యలో నాగసాధువులు తరలివచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నాగసాధువులు ఒంటి మీద నూలుపోగు లేకుండా హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. విపరీతమైన చలి, ఎండకు కూడా వీరు చలించరు. అన్ని రుతువులకు తట్టుకునేలా అగ్నిసాధన, నాడీ శోధన, మంత్రపఠనం చేసి శరీరం, మనసుపై నియంత్రణ పొందుతారు. రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం తీసుకుంటారు. వీరు చనిపోయిన చోటే సమాధి చేస్తారు.
News January 26, 2025
మహ్మద్ షమీకి మళ్లీ మొండిచేయే..!
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టీ20లో స్థానం దక్కకపోయినా రెండో మ్యాచులోనైనా ఆయనను ఆడిస్తారని అంతా భావించారు. కానీ మేనేజ్‌మెంట్ అతడిని పెవిలియన్‌కే పరిమితం చేసింది. దీంతో చాన్నాళ్లకు షమీ బౌలింగ్ చూద్దామనుకున్న అభిమానులకు మరోసారి అసంతృప్తే మిగిలింది. మూడో టీ20లోనైనా ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News January 26, 2025
అది షో ఆఫ్ ఎలా అవుతుంది?: ఊర్వశీ రౌతేలా
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడే సమయంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఆభరణాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశీ స్పందించారు. ‘సైఫ్‌పై దాడి విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు తెలిసినంత వరకు చెప్పా. అదే సమయంలో నాకు బహుమతిగా వచ్చిన కానుకల గురించి చెప్పా. ఇది ఏమాత్రం షో ఆఫ్ కాదు. అదే నిజమైతే నా చేతికి ఉన్న చిన్న వాచ్‌ను కూడా చూపించేదాన్ని’ అని చెప్పారు.