News August 19, 2024
జగన్కు షర్మిల రాఖీ కడతారా?

రక్షాబంధన్ రోజున తన అన్నయ్య, మాజీ సీఎం జగన్కు షర్మిల రాఖీ కడతారా? లేదా? అనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో రాజకీయంగా విడిపోయారు. జగన్పై షర్మిల విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ప్రతిసారి అన్నయ్యకు రాఖీ కట్టిన షర్మిల.. 2021 నుంచి దూరంగా ఉన్నారు. మరి ఈసారైనా రాఖీ కడతారా?
Similar News
News November 22, 2025
నిర్మల్: మండలాలకు ఫాగింగ్ మెషీన్ల పంపిణీ

జిల్లాలోని పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 18 ఫాగింగ్ యంత్రాలను మండలానికి ఒకటి చొప్పున ఎంపీఓలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అందించారు. ఫాగింగ్ యంత్రాలను సమర్ధవంతంగా వినియోగించాలని సూచించారు. దోమలను సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు.
News November 22, 2025
సున్నాకే 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

ACC రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీస్లో భారత్-A ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. <<18351593>>సూపర్ ఓవర్లో<<>> ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఈజీగా గెలిచేసింది. ఈ నేపథ్యంలో ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్లో ఎందుకు బ్యాటింగ్కు పంపలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయామని మండిపడుతున్నారు. వైభవ్ ఆడుంటే ఇంకోలా ఉండేదని అంటున్నారు. మీరేమంటారు?
News November 22, 2025
అధికారి కొడుకు, కూలీ కొడుకు పోటీ పడేలా చేయలేం: సీజేఐ

SC, ST రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై తన తీర్పుకు కట్టుబడి ఉన్నానని CJI జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సీఎస్ కొడుకును వ్యవసాయ కూలీ కొడుకుతో పోటీ పడేలా చేయలేమని అన్నారు. ‘ఆర్టికల్ 14 సమానత్వాన్ని నమ్ముతుంది. అంటే అందరినీ సమానంగా చూడాలని కాదు. వెనుకబడిన వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. సమానత్వ భావనంటే ఇదే’ అని చెప్పారు. తన చివరి వర్కింగ్ డే సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


