News August 19, 2024

జగన్‌కు షర్మిల రాఖీ కడతారా?

image

రక్షాబంధన్ రోజున తన అన్నయ్య, మాజీ సీఎం జగన్‌కు షర్మిల రాఖీ కడతారా? లేదా? అనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో రాజకీయంగా విడిపోయారు. జగన్‌పై షర్మిల విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ప్రతిసారి అన్నయ్యకు రాఖీ కట్టిన షర్మిల.. 2021 నుంచి దూరంగా ఉన్నారు. మరి ఈసారైనా రాఖీ కడతారా?

Similar News

News September 21, 2024

చరిత్ర సృష్టించిన అఫ్గాన్

image

రెండో వన్డేలో సౌతాఫ్రికాపై 177 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో రన్స్ పరంగా ఆ జట్టుకు ఇదే బిగ్గెస్ట్ విన్. గతంలో జింబాబ్వేపై 154, 146, బంగ్లాదేశ్‌పై 142, ఐర్లాండ్‌పై 138 పరుగుల తేడాతో గెలిచింది. ఇక సౌతాఫ్రికాకు ఐదో అతిపెద్ద ఓటమి. గతంలో ఇండియా 243, పాక్ 182, శ్రీలంక 180, 178 రన్స్ తేడాతో ఆ జట్టుపై విజయం సాధించాయి.

News September 21, 2024

రేట్ల ఎఫెక్ట్.. BSNLకు పెరిగిన యూజర్లు

image

ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలకు 10-27 శాతం పెంచాయి. దీంతో యూజర్లు ఆ ప్రైవేటు టెలికాం కంపెనీలకు షాకిచ్చారు. జులైలో ఎయిర్‌టెల్ 16.9 లక్షలు, VI 14.1 లక్షలు, జియో 7.58 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. అదే సమయంలో BSNLలోకి ఏకంగా 29 లక్షల మంది చేరారు. ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

News September 21, 2024

భద్రతామండలిలో చేరేందుకు భారత్‌కు ఉన్న అడ్డంకులివే

image

ఐరాస భద్రతామండలి(UNSC)లో US, ఫ్రాన్స్, రష్యా, UK, చైనాలు శాశ్వత సభ్యదేశాలు. భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నా సభ్యత్వం మాత్రం దక్కడం లేదు. వీటో అధికారంతో చైనా మోకాలడ్డుతుండటం, ‘వీటో పవర్ లేకుండానే సభ్యత్వం’ అనే ప్రతిపాదనకు భారత్ నిరాకరణ, తాము చెప్పిన మాట భారత్ వినదేమోనన్న పశ్చిమ దేశాల అనుమానాలు, పొరుగు దేశాలపై భారత్‌కు నియంత్రణ లేకపోవడం కారణాలుగా ప్రపంచ రాజకీయ నిపుణులు చెబుతున్నారు.