News May 24, 2024
నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహిస్తారా?: కనకమేడల

AP: పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని TDP నేత కనకమేడల రవీంద్ర ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని హింస రాష్ట్రంలో జరిగిందన్నారు. పిన్నెల్లిని అరెస్టు చేయాలని EC ఆదేశించినా పోలీసులు జాప్యం చేశారని మండిపడ్డారు. హింసాత్మక చర్యలకు సహకరించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. కౌంటింగ్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా అనే అనుమానం ఉందని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>
News December 13, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.


