News May 24, 2024

నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహిస్తారా?: కనకమేడల

image

AP: పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని TDP నేత కనకమేడల రవీంద్ర ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని హింస రాష్ట్రంలో జరిగిందన్నారు. పిన్నెల్లిని అరెస్టు చేయాలని EC ఆదేశించినా పోలీసులు జాప్యం చేశారని మండిపడ్డారు. హింసాత్మక చర్యలకు సహకరించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. కౌంటింగ్‌‌లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా అనే అనుమానం ఉందని పేర్కొన్నారు.

Similar News

News February 16, 2025

ఫాస్టాగ్ కొత్త రూల్స్.. చెక్ చేసుకోండి

image

ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి NPCI రేపటి నుంచి కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది. బ్లాక్‌లిస్టులో ఉన్న ఫాస్టాగ్ యూజర్లు టోల్ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండింతల ఛార్జి చెల్లించాల్సిందే. కేవైసీ అసంపూర్తిగా ఉన్నా, తగిన బ్యాలెన్స్ లేకపోయినా ఫాస్టాగ్‌ బ్లాక్‌లిస్ట్ అవుతుంది. కాబట్టి బయలుదేరే ముందుగానే ఫాస్టాగ్ సరిచూసుకోవడం మంచిది.

News February 16, 2025

నిద్రలేవగానే ఇలా చేయండి

image

రోజుని ఉల్లాసంగా ప్రారంభించేందుకు ఉదయాన్నే నిద్ర లేవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్లతో ఫిట్‌గా ఉండటమే కాకుండా ఒత్తిడిని జయిస్తారని నిపుణులు చెబుతున్నారు.
* వేకువజామునే నిద్రలేవడం
* యోగా/వ్యాయామం/ధ్యానం చేయడం
* లేచిన వెంటనే నీరు తాగడం(కుదిరితే గోరువెచ్చని నీరు)
* ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
* సానుకూలమైన ఆలోచనలు
* రోజులో ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి.

News February 16, 2025

కోళ్లు చనిపోతే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

TG: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మం. నేలపట్లలో వెయ్యి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు కోళ్ల నమూనాలు సేకరించి HYDలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ల్యాబుకు పంపారు. 3 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ రానుందని, అప్పటివరకు కోళ్లు అమ్మవద్దని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడైనా కోళ్లు చనిపోతే 9100797300కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

error: Content is protected !!