News November 17, 2024
‘మట్కా’ సినిమా వచ్చేది ఈ ఓటీటీలోనే?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. రూ.42కోట్లతో ఈ మూవీని రూపొందించగా, నెట్‌ఫ్లిక్స్ రూ.15కోట్లు చెల్లించినట్లు సమాచారం. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. ఈనెల 14 రిలీజైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News December 6, 2024
రేపు నల్గొండలో లక్ష మందితో CM రేవంత్ సభ
TG: CM రేవంత్ రెడ్డి రేపు నల్గొండలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడాది కానుండటంతో జిల్లా కేంద్రంలో లక్ష మందితో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లు, గంధంవారిగూడెం వద్ద నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాల తదితర అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
News December 6, 2024
RBI మీటింగ్: CRR తగ్గిస్తే ఏమవుతుందంటే..
CRR అంటే క్యాష్ రిజర్వు రేషియో. ప్రతి బ్యాంకు RBI వద్ద కొంత నగదును ఉంచాలి. ఎంతమేర ఉంచాలో RBI MPC నిర్ణయిస్తుంది. ప్రస్తుతమిది 4.5 శాతంగా ఉంది. నేటి మీటింగులో CRRను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే రూ.1.10 లక్షల కోట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ నగదును బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. దీంతో లిక్విడిటీ పెరిగి ఆర్థిక కార్యకలాపాలు, కొనుగోలు శక్తి, వస్తూత్పత్తి పుంజుకుంటాయి.
News December 6, 2024
ప్రజా తీర్పు కదా! ఐదేళ్లూ పదవిలో ఉంటా: మేక్రాన్
ప్రజలు తనకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ అన్నారు. ఏదేమైనా పూర్తికాలం పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు నచ్చే PM అభ్యర్థిని త్వరలోనే నియమిస్తానన్నారు. అవిశ్వాస తీర్మానంతో PM మైకేల్ బెర్నియర్ పదవీచ్యుతుడయ్యారు. పార్లమెంటరీ ఆమోదం లేకుండా స్పెషల్ పవర్ ఉపయోగించి బడ్జెట్‌పై చర్యలు తీసుకోవడంతో విపక్షాలు ఏకమై అవిశ్వాసం పెట్టాయి.