News March 23, 2024

ఈసారి పోలింగ్ 75% దాటుతుందా?

image

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 67.40%తో ఆల్ టైమ్ హై నమోదైంది. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 75% దాటాలని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ మినహా ఇతర ప్రాంతాల్లో 2014తో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. J&Kలో 2014లో 49.72% నమోదు కాగా 2019లో అది 29.39%కు పరిమితమైంది. కాగా 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతో తెలుసా? 45.67శాతం.

Similar News

News April 19, 2026

నాసా ఫొటో.. వెలుగు జిలుగుల్లో యూపీ, బిహార్!

image

భూమి నైట్ లైఫ్‌పై NASA ఇటీవల రిలీజ్ చేసిన ఇమేజెస్ వైరలవుతున్నాయి. ఇందులో భారత్.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్‌లు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. 2014-2022 మధ్య తొమ్మిదేళ్ల పాటు రాత్రి వేళ ఉపగ్రహాలు తీసిన 1.16 మిలియన్ శాటిలైట్ ఇమేజెస్‌ ఆధారంగా నాసా వీటిని రిలీజ్ చేసింది. వెనుకబడిన రాష్ట్రంగా పరిగణించే బిహార్ విద్యుత్ వెలుగుల్లో టాప్‌లో ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

రేపు సీఎం vs మాజీ సీఎం

image

TG: చాలా రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. రేపు CM, మాజీ CM బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ భూపాలపల్లి (D) కాటారంలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. అటు జీవన్ రెడ్డి BRSలో చేరిక సందర్భంగా జగిత్యాల సభకు KCR హాజరుకానున్నారు. ఆయన అధికార పార్టీపై ఎలాంటి విమర్శనాస్త్రాలతో వస్తారనేది ఆసక్తికరంగా మారింది.