News July 9, 2024
సిరీస్ సమం చేస్తారా?

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో నేడు భారత్ చివరి T20 ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఓడిపోగా, రెండో మ్యాచ్ SA బ్యాటింగ్ పూర్తయ్యాక వర్షం కురవడంతో రద్దైంది. దీంతో మూడో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని హర్మన్ ప్రీత్ సేన చూస్తోంది. రెండు మ్యాచుల్లోనూ భారత బౌలర్లు విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ్టి మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేసి గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై PM మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై AP Dy.CM పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు విజ్ఞప్తి చేశారు.
News October 24, 2025
కంట్రోల్ రూమ్స్ నంబర్లు ఇవే

AP: కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు.
☞ కలెక్టరేట్లో: 08518-277305
☞ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి: 9121101059
☞ ఘటనా స్థలి వద్ద: 9121101061
☞ కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం: 9121101075
☞ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు:
9494609814, 9052951010
★ బాధిత కుటుంబాలు పై నంబర్లకు ఫోన్ చేయొచ్చు.
News October 24, 2025
ఈ నెల 29న మెగా జాబ్‌మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు(D) నరసరావుపేటలోని ఈశ్వర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, ఫార్మసీ, డిగ్రీ, ఇంజినీరింగ్, MBBS, PG అర్హతగల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 – 35ఏళ్ల మధ్య ఉండాలి. ఈ జాబ్‌మేళాలో 34 MNC కంపెనీలు పాల్గొంటున్నాయి. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/


