News April 2, 2024

స్టాక్ మార్కెట్లలో ఎన్నికల జోష్ కనిపించదేం?

image

సాధారణంగా ఎన్నికల వేళ జోరు ప్రదర్శించే స్టాక్ మార్కెట్లలో ఈసారి ఆశించినంత జోష్ లేకపోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ పరిణామాలే ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. ఎలక్టోరల్ బాండ్ల వివాదం, అవినీతి ఆరోపణలు మొదలైన అంశాలు సంచలనమైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉంటున్నారట. మార్కెట్ల జోష్‌ BJP గెలుపుతో ముడిపడి ఉందని.. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే మార్కెట్లు ఊపందుకుంటాయని చెబుతున్నారు.

Similar News

News October 7, 2024

అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు భారీ వర్షాలు

image

ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News October 7, 2024

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది

image

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది పూర్తి అయింది. 2023, అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. పిల్లలు, యువతుల్ని బందీలుగా తీసుకెళ్లడంతో పాలస్తీనాలో IDF ఏరివేత మొదలు పెట్టింది. దీంతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మధ్యలో బందీలను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నా హెజ్బొల్లా దూరడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం స్థాయికి చేరింది.

News October 7, 2024

జగన్ పుంగనూరు పర్యటన రద్దు: పెద్దిరెడ్డి

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని ఎల్లుండి పరామర్శించాల్సి ఉండగా అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నట్లు చెప్పారు. జగన్ పర్యటిస్తారనే భయంతోనే ముగ్గురు మంత్రులు ఆఘమేఘాల మీద ఇక్కడికొచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.