News April 3, 2024

టీమ్ ఇండియా నుంచి పిలుపు వచ్చేనా?

image

IPL అంటేనే ఎమర్జింగ్ ప్లేయర్లకు అడ్డా. ఎప్పటిలాగే ఈసారి కూడా కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తోంది. LSG పేస్ గన్ మయాంక్ యాదవ్, RR బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో ఆకట్టుకుంటున్నారు. పరాగ్ ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండగా.. మయాంక్ తన స్పీడ్‌తో వరల్డ్ క్లాస్ బ్యాటర్లనే వణికిస్తున్నారు. వీరికి త్వరలోనే భారత జట్టు నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. T20WCలో చోటు దక్కినా ఆశ్చర్యం అక్కర్లేదు.

Similar News

News April 21, 2025

రేపటి నుంచి ‘NTR-NEEL’ మూవీ షూటింగ్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ‘NTR-NEEL’ సినిమా షూటింగ్ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా సముద్రపు ఒడ్డున హీరో, డైరెక్టర్ నిల్చొని డిస్కస్ చేస్తోన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీరాలను దాటిచేందుకు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

News April 21, 2025

న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫారసు

image

ఏపీ, తెలంగాణ, కర్ణాటక హైకోర్టుల నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.మన్మథరావు కర్ణాటక హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేందర్ మద్రాస్ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏప్రిల్ 15, 19 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం నిర్ణయం తీసుకుంది.

News April 21, 2025

రావణుడొచ్చేస్తున్నాడు!

image

రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తోన్న ‘రామాయణ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. రావణుడి పాత్రలో నటిస్తోన్న యష్ ఈ వారంలోనే షూటింగ్‌లో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆయన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారని పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయన ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘రామాయణ’ చిత్రాన్ని నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు.

error: Content is protected !!