News August 10, 2024
మరో పతకం వచ్చేనా?
పారిస్ ఒలింపిక్స్‌లో పోటీలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజున భారత్ మరో పతకంపై ఆశలు పెట్టుకుంది. రెజ్లింగ్‌లో యువ అథ్లెట్ రితికా హుడా 76 కేజీల మహిళల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గోల్ఫ్‌లో దీక్ష దగర్, అదితి అశోక్ బరిలో ఉన్నారు. కాగా ఇప్పటివరకు జరిగిన పోటీల్లో భారత్‌కు ఒక రజతం, ఐదు కాంస్యాలు వచ్చాయి.
Similar News
News September 10, 2024
నేడు తాడేపల్లికి జగన్ రాక
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు. అదే జైల్లో ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా జగన్ కలవనున్నారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
News September 10, 2024
చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి
భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించుకుపోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు. ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది. ‘బాంచన్ కాల్మొక్తా’ అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారు. నేడు ఆమె వర్ధంతి.
News September 10, 2024
టాప్ డైరెక్టర్లతో యంగ్‌టైగర్.. పిక్స్ వైరల్
టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, కొరటాల శివ, అయాన్ ముఖర్జీతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీ ట్రైలర్ ఇవాళ ముంబైలో విడుదల కానుండటంతో వీరందరూ అక్కడ కలుసుకున్నారు. కాగా ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. కొరటాలతో ‘దేవర’, నీల్‌తో ‘NTR31’, అయాన్‌తో ‘వార్ 2’ సినిమాలు చేస్తున్నారు.