News March 29, 2024
ఈ టీమ్ ట్రోఫీ గెలుస్తుందా?

జూన్‌లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును BCCI త్వరలోనే ప్రకటించనుంది. ప్లేయర్ల ఎంపికపై సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు. వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే భారత ప్రాబబుల్-11ను తాజాగా Sportstar ప్రకటించింది. రోహిత్, జైస్వాల్, కోహ్లీ, సూర్య, రింకూ, హార్దిక్, జురెల్, జడేజా, అక్షర్, బుమ్రా, సిరాజ్ ఆ టీమ్‌లో ఉన్నారు. ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందని భావిస్తున్నారా? కామెంట్ చేయండి..
Similar News
News March 15, 2026
పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్

AP: పార్టీ చీఫ్ చంద్రబాబు <<19391495>>ఆదేశాలతో<<>> పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
News March 15, 2026
ఫింగర్ ప్రింట్‌లాగే టంగ్ ప్రింట్స్.. తెలుసా?

ప్రతి మనిషికి వేలిముద్రలు ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో నాలుక ముద్రలు (Tongue prints) కూడా అలాగే ఒకరితో ఒకరికి అస్సలు పోలి ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకృతి, ఉపరితల నిర్మాణం ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కవలల విషయంలోనూ ఇవి భిన్నంగానే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇది అత్యంత నమ్మదగిన బయోమెట్రిక్ గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 15, 2026
22న రైతు భరోసా నిధులు

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట(D) నర్మెట్టలో CM రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు 20రోజుల తర్వాత రెండో విడత, APR నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నారు. 3 విడతల్లో కలిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి.


