News April 11, 2024
లక్షన్నర మెజార్టీతో గెలుస్తా : మాధవీలత

TG: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికే వ్యతిరేకమని దుయ్యబట్టారు. రజాకార్లకు తోడుగా ఉండే వారంతా తన ప్రత్యర్థులేనన్నారు. రాబోయే ఎన్నికల్లో తనదే విజయమని.. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్పై లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలుస్తానని జోస్యం చెప్పారు.
Similar News
News November 19, 2025
కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

శబరిమల యాత్రలో పేరూర్తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>
News November 19, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<
News November 19, 2025
లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్గఢ్లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.


