News June 5, 2024
టీడీపీ, జేడీయూని సంప్రదిస్తారా? రాహుల్ సమాధానమిదే!
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీయూ వంటి పార్టీలను సంప్రదించడంపై నేడు నిర్ణయం తీసుకుంటామన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే కూటమి పార్టీలను సంప్రదిస్తారా అన్న మీడియా ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. మేజిక్ ఫిగర్ అయిన 272 సీట్లు బీజేపీకి సొంతంగా రాకపోవడంతో ఇండియా కూటమికి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వచ్చినట్టయింది. కాగా సా.6 గం.కు ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు.
Similar News
News November 6, 2024
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
ఏపీలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీలపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. 2019లో భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌పై గ్రంథి శ్రీనివాస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇటు పలు జిల్లాల్లో వ్యాపారుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ చేపట్టింది.
News November 6, 2024
ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
News November 6, 2024
హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం: టీడీపీ
AP: హైదరాబాద్‌లో మాజీ సీఎం ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన చోటే విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్పారు. కాగా విగ్రహంతోపాటు కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను టీడీపీ నేతలు కలిసినట్లు సమాచారం.