News May 1, 2024
చంద్రబాబుని మళ్లీ నమ్ముతారా: సీఎం జగన్

తాను పేదల పక్షాన నిలుస్తుంటే కూటమి నేతలు సహించలేకపోతున్నారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ‘ఇదొక క్లాస్ వార్. పేదలకు పథకాలు అందాలంటే వైసీపీ మళ్లీ రావాలి. పిల్లల చదువుల కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు తెచ్చాం. ఏకంగా 2.70లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పథకమైనా గుర్తొస్తుందా? గతంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబుని మళ్లీ నమ్ముతారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News March 6, 2026
సుఖోయ్ క్రాష్.. ఇద్దరు పైలట్లు మృతి

అస్సాంలో నిన్న సుఖోయ్ <<19308614>>యుద్ధ విమానం<<>> క్రాష్ అయిన విషయం తెలిసిందే. అందులో ఉన్న పైలట్లు అనుజ్, పుర్వేష్ దురగ్‌ఖర్ చనిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. నిన్న రాత్రి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే 7.42pmకు రాడార్ నుంచి ఫైటర్ జెట్ కాంటాక్ట్ కోల్పోయినట్లు IAF తెలిపింది.
News March 6, 2026
నేపాల్ రిజల్ట్స్.. లీడింగ్‌లో RSP

హిమాలయ దేశం నేపాల్‌లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) 32 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. పార్టీ చీఫ్ రబి లామిచానే, సీనియర్ నేత బాలెన్ షా ముందంజలో కొనసాగుతున్నారు. RSP విజయం సాధిస్తే బాలెన్ షా(ఫొటోలో) PM అయ్యే అవకాశం ఉంది. పూర్తి రిజల్ట్స్ ఇవాళ సాయంత్రంలోపు రానున్నాయి.
News March 6, 2026
సీఎం పదవికి ఈ నెల 16న నితీశ్ రాజీనామా?

రాజ్యసభ అభ్యర్థిగా నిన్న నామినేషన్ వేసిన నితీశ్ కుమార్ ఈ నెల 16న ఫలితాలు వెలువడ్డాక బిహార్ CMగా రాజీనామా చేసే అవకాశం ఉంది. 2 నెలల తర్వాత ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. అయితే నితీశ్‌కు కీలక శాఖ ఇస్తారా లేక అనారోగ్య సమస్యల కారణంగా అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేస్తారా అనేది ఆసక్తికరం. ఇక బిహార్ కొత్త ప్రభుత్వంలో నితీశ్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతోంది.


