News May 3, 2024
పునరుత్పాదక శక్తిదే హవా
2023-24 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక శక్తి హవా కొనసాగిందని సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ (CEEW-CEF) వెల్లడించింది. ‘దేశంలో కొత్తగా ఉత్పత్తి అయిన 26 గిగావాట్ల విద్యుత్‌లో 70%పైగా పునరుత్పాదక శక్తి నుంచే వచ్చింది. మరోవైపు థర్మల్ విద్యుత్ వాటా తొలిసారిగా 50% దిగువకు చేరింది. ప్రస్తుతం దేశంలో విద్యుత్ సామర్థ్యం 442 గిగావాట్లు కాగా ఇందులో 33% (144 గిగావాట్లు) రెన్యూవబుల్ ఎనర్జీదే’ అని పేర్కొంది.
Similar News
News November 8, 2024
వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు
TG: ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామికి రాష్ట్ర మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. నాగచైతన్య-శోభితల పెళ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మహిళా కమిషన్ స్పందించింది. గతంలోనూ నోటీసులు ఇవ్వగా, కోర్టును ఆశ్రయించిన వేణుస్వామి విచారణ నుంచి తప్పించుకున్నారు. తాజాగా స్టే ఎత్తివేయడంతో మళ్లీ ఆయనకు నోటీసులు పంపింది.
News November 8, 2024
తన స్నేహితుడిలా మరెవరికీ జరగొద్దని..!
దేశంలో ఏటా 1.50లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీరిలో ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతోనే చాలామంది మరణిస్తున్నారు. అలా చనిపోయిన వారిలో దినేశ్ ఒకరు. తన మిత్రుడిలా ఎవరూ చనిపోవద్దని వివేక్ అనే వ్యక్తి ఓ పరికరం కనుగొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటో మెటిక్‌గా ట్రిగ్గర్ అయ్యే రక్షణ వ్యవస్థను తయారు చేశారు. ఇది ప్రమాద లోకేషన్ ఆధారంగా ఎమర్జెన్సీ సేవలకు సమాచారం ఇస్తుంది. ఇదంతా 3ని.లలోపే జరుగుతుంది.
News November 8, 2024
ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్
AP: ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు.