News December 2, 2024

చరిత్ర సృష్టించిన విండీస్ క్రికెటర్

image

వెస్టిండీస్ క్రికెటర్ క్రెగ్ బ్రాత్‌వైట్ సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా 86 టెస్టులు ఆడిన విండీస్ ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. ఈ క్రమంలో 52 ఏళ్ల క్రితం నమోదైన గార్ఫీల్డ్ సోబర్స్ (85) రికార్డును బ్రాత్ వైట్ అధిగమించారు. 2014 నుంచి 2024 వరకు ఆయన ఒక్క టెస్టు మ్యాచ్ కూడా మిస్ కాలేదు. కాగా 32 ఏళ్ల బ్రాత్ వైట్ తన పదేళ్ల కెరీర్‌లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం.

Similar News

News February 19, 2025

రేవంత్‌కు రూ.4.20 లక్షల కోట్లు జరిమానా వేసినా తప్పులేదు: కేటీఆర్

image

TG: అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌కు జరిమానా వేయాలని కేటీఆర్ అన్నారు. సింగపూర్ పార్లమెంట్లో రెండు అబద్ధాలు చెప్పినా ఫైన్ వేశారని ఓ ఆర్టికల్‌ను కేటీఆర్ చేశారు. కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పులు, హామీల గురించి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 420 అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి రూ.4.20 లక్షల కోట్ల జరిమానా వేసినా తప్పులేదని అన్నారు.

News February 19, 2025

RTCలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్

image

APSRTCలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10లక్షల ప్రమాద బీమా వర్తించనుంది. అద్దె బస్సులు, ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, బస్సుల్లో అటెండర్లు, బస్టాండ్లు, గ్యారేజీలు, స్వీపర్లు, గైడ్లు, కౌంటర్లలో బస్ టికెట్లు జారీ చేసే సిబ్బందికి ఇది వర్తించనుంది. దీనికి వారిని నియమించుకున్న కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి రూ.499 చొప్పున పోస్టల్ శాఖ అంత్యోదయ శ్రామిక్ సురక్ష యోజన బీమాకు ప్రీమియం చెల్లించాలి.

News February 19, 2025

ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ

image

బాలీవుడ్‌లో హీరోయిన్ కీర్తి సురేశ్ నటించిన తొలి చిత్రం ‘బేబీజాన్’ ఉచిత స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు రెంట్ పద్ధతితో ఉండగా నేటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. కాగా ఈ మూవీ తమిళ చిత్రం విజయ్ ‘తేరి’కి రీమేక్ కావడం గమనార్హం.

error: Content is protected !!