News June 11, 2024
నేపాల్ క్రికెటర్‌కు విండీస్ గుడ్ న్యూస్

నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు వెస్టిండీస్ శుభవార్త చెప్పింది. తమ ప్రాంతంలో నేపాల్ ఆడే మ్యాచుల్లో సందీప్ పాల్గొనవచ్చని విండీస్ ప్రకటించింది. దీంతో నేపాల్ ఆడబోయే చివరి రెండు మ్యాచుల్లో ఆయన బరిలోకి దిగనున్నారు. కాగా తొలుత ఎంపిక చేసిన నేపాల్ జట్టులో సందీప్‌కు చోటు దక్కింది. కానీ అత్యాచార ఆరోపణలు ఉన్నాయన్న కారణంతో ఆయనకు USA వీసా నిరాకరించింది. దీంతో నేపాల్ ఆడిన తొలి మ్యాచులో ఆయన పాల్గొనలేదు.
Similar News
News March 27, 2025
పెరిగిన బంగారం ధరలు

వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,350లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.89,840 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.
News March 27, 2025
రామ్ చరణ్‌కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

రామ్ చరణ్‌కు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘పెద్ది పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. నీలోని నటున్ని కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు ఇది కనుల పండుగ కానుందని నమ్ముతున్నా’ అని మెగాస్టార్ Xలో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ NTRతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు విషెస్ తెలిపారు.
News March 27, 2025
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల

AP: CM చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2026 నాటికి నిర్వాసితులకు అన్ని కాలనీలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.