News August 26, 2024

సఫారీలపై విండీస్ విజయం.. సిరీస్ కైవసం

image

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచులో వెస్టిండీస్ విజయం సాధించింది. మూడు T20ల్లో వరుసగా రెండు విజయాలతో సిరీస్‌ను దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఛేదనలో సఫారీ జట్టు 149 పరుగులకే ఆలౌటైంది. కాగా దక్షిణాఫ్రికాపై విండీస్‌కు ఇది వరుసగా మూడో టీ20 సిరీస్ విజయం. చివరిదైన మూడో T20 మ్యాచ్ 28న జరగనుంది.

Similar News

News November 25, 2025

కొత్తగా పెద్దహరివనం మండలం!

image

ఆదోని మండల పునర్విభజన ఖాయమైంది. కొత్తగా పెద్దహరివనం మండలం ఏర్పాటు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. సీఎం చంద్రబాబు నేడు మరోసారి మంత్రులు, అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం 42 గ్రామాలతో ఒకే మండలంగా ఆదోని నియోజకవర్గం ఉంది. దీనిని 4 మండలాలుగా విభజించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News November 25, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.

News November 25, 2025

దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

image

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్‌ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.