News August 26, 2024
సఫారీలపై విండీస్ విజయం.. సిరీస్ కైవసం
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచులో వెస్టిండీస్ విజయం సాధించింది. మూడు T20ల్లో వరుసగా రెండు విజయాలతో సిరీస్‌ను దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఛేదనలో సఫారీ జట్టు 149 పరుగులకే ఆలౌటైంది. కాగా దక్షిణాఫ్రికాపై విండీస్‌కు ఇది వరుసగా మూడో టీ20 సిరీస్ విజయం. చివరిదైన మూడో T20 మ్యాచ్ 28న జరగనుంది.
Similar News
News September 11, 2024
రుణమాఫీ సర్వే 50% పూర్తి.. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు
TG: రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే 50% పూర్తయింది. రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాని 4.24 లక్షల మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. దీంతో అధికారులు గ్రామాలకు వెళ్లి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి, సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
News September 11, 2024
టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: సీఎం రేవంత్
TG: టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ట్రైనీ ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
News September 11, 2024
కేసీఆర్ కల సాకారమైంది: హరీశ్ రావు
TG: కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావడం సంతోషకరమని హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని, దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090కి చేరిందని వివరించారు.