News July 19, 2024

విండోస్ సమస్య పరిష్కరించాం: మైక్రోసాఫ్ట్

image

విండోస్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్‌కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. దీనికి డీబగ్ ఫిక్స్ చేసి సమస్య పరిష్కరించినట్లు పేర్కొంది. కాగా ప్రపంచవ్యాప్తంగా సిస్టమ్‌లు షట్‌డౌన్/రీస్టార్ట్ అయ్యాయి. దీంతో పలు రంగాల్లో వివిధ రకాల సేవలకు అంతరాయం కలిగింది. మిలియన్ల కొద్దీ యూజర్లు తీవ్ర అవస్థలు పడ్డారు.

Similar News

News October 16, 2025

విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

image

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్‌ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.

News October 16, 2025

‘టెస్ట్ 20’.. క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్

image

టెస్ట్, టీ20ల కలయికతో ‘టెస్ట్ 20’ అనే సరికొత్త ఫార్మాట్‌ రాబోతోంది. ఇందులో రెండు జట్లు 20 ఓవర్ల చొప్పున ఒకే రోజు 2 ఇన్నింగ్స్‌లు ఆడతాయి. టెస్టు మ్యాచ్‌లా 2సార్లు బ్యాటింగ్ చేయొచ్చు. 2026 JANలో ‘జూనియర్ టెస్ట్ 20 ఛాంపియన్‌షిప్’ తొలి సీజన్ నిర్వహించనున్నట్లు ఈ ఫార్మాట్ ఫౌండర్ గౌరవ్ బహిర్వాని తెలిపారు. దీనికి మాజీ ప్లేయర్స్ ఏబీ డివిలియర్స్, క్లైవ్ లాయిడ్, హెడెన్, హర్భజన్ సలహాదారులుగా ఉన్నారు.

News October 16, 2025

ఇదే నాకు చివరి దీపావళి: యువకుడి ఎమోషన్

image

తనపై క్యాన్సర్ గెలిచిందని ఓ యువకుడు(21) Redditలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘2023లో పెద్దపేగు క్యాన్సర్ అని తెలిసి ఎన్నో రోజులు ఆస్పత్రిలో కీమోథెరపీ చికిత్స తీసుకున్నా. స్టేజ్4లోని నేను ఇంకో ఏడాదే ఉంటానని డాక్టర్లు చెప్పారు. వీధుల్లో దీపావళి సందడి కన్పిస్తోంది. నాకు ఇవే చివరి వెలుగులు, నవ్వులు. నా జీవితం, కలలు కరిగిపోతున్నాయనే బాధ కుటుంబంలో చూస్తున్నా’ అని చేసిన పోస్ట్ ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది.