News July 19, 2024
విండోస్ సమస్య పరిష్కరించాం: మైక్రోసాఫ్ట్
విండోస్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్‌కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. దీనికి డీబగ్ ఫిక్స్ చేసి సమస్య పరిష్కరించినట్లు పేర్కొంది. కాగా ప్రపంచవ్యాప్తంగా సిస్టమ్‌లు షట్‌డౌన్/రీస్టార్ట్ అయ్యాయి. దీంతో పలు రంగాల్లో వివిధ రకాల సేవలకు అంతరాయం కలిగింది. మిలియన్ల కొద్దీ యూజర్లు తీవ్ర అవస్థలు పడ్డారు.
Similar News
News December 11, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 11, 2024
మోహన్‌బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశం
TG: హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
News December 11, 2024
డిసెంబర్ 11: చరిత్రలో ఈ రోజు
* 1922: సినీ నటుడు దిలీప్ కుమార్ జననం
* 1931: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం
* 1953: UNICEF ఏర్పాటు
* 1969: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జననం
* 1995: హీరోయిన్ నబా నటేష్ జననం
* 2004: MS సుబ్బలక్ష్మీ(ఫొటోలో) మరణం
* 2012: సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ మరణం
* అంతర్జాతీయ పర్వత దినోత్సవం