News September 8, 2024
బంగాళాఖాతంలో వాయుగుండం.. విస్తారంగా వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంవైపు కదులుతోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
Similar News
News October 5, 2024
శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్
శబరిమల దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న భక్తులకే దర్శనం కల్పిస్తామని, అది కూడా రోజుకు 80వేల మందికే అనుమతి ఉంటుందని తెలిపింది. అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే మకరవిళక్కు సీజన్ మరో నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. శబరిమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
News October 5, 2024
రూ.10 కాయిన్లు తీసుకోండి: SBI
రూ.10 కాయిన్స్ చెల్లడం లేదనే అపోహతో చాలామంది తీసుకోవడం లేదు. ఈ అపోహ తొలగించాలనే లక్ష్యంతో SBI వరంగల్ జోనల్ కార్యాలయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సమన్వయంతో ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకు అధికారులు వ్యాపారులకు, ప్రజలకు రూ.10 నాణేలను పంపిణీ చేశారు. ₹10 కాయిన్స్ చెల్లుతాయని అందరూ స్వీకరించాలని కోరారు.
News October 5, 2024
దేశంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం!
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైనట్టేనని హరియాణా, JK ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ అంచనాలు గనుక నిజమైతే దేశంలో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని పేర్కొంటున్నారు.