News October 8, 2024

ప్రభుత్వానికి వైన్ డీలర్ల విజ్ఞప్తి

image

AP: కూటమి ప్రభుత్వానికి ఏపీ వైన్ డీలర్ల సంఘం కీలక విజ్ఞప్తి చేసింది. నూతన మద్యం పాలసీలోని నిబంధనను 21(5) మార్చాలని కోరింది. హైవేలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు పాఠశాలల నుంచి మద్యం షాపులు ఉండాల్సిన నిర్దేశిత దూరాన్ని కాలినడక ఆధారంగా కొలిచే విధానాన్ని తొలగించడాన్ని ఆక్షేపించింది. ఒకే లైనులో కొలత వేయాలన్న నిబంధన షాపుల ఏర్పాటుకు అవాంతరంగా మారుతుందని పేర్కొంది.

Similar News

News October 8, 2024

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్!

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఆన్‌లైన్ వర్చువల్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. దీనికోసం భక్తులు sabarimalaonline.org వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్టర్‌పై క్లిక్ చేసి మీ ఫొటోతో వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPతో ఖాతా ధ్రువీకరించి దర్శనానికి వెళ్లే రోజును ఎంచుకుని సబ్మిట్ కొడితే వర్చువల్ క్యూ టికెట్ వస్తుంది. రోజుకు 80వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు.

News October 8, 2024

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇంటర్ మొదటి, రెండో ఏడాది చదివే విద్యార్థులు తప్పనిసరిగా 75 శాతం హాజరు కలిగి ఉండాలని బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హాజరు శాతం 60-65గా ఉంటే రూ.2వేలు, 65-70గా ఉంటే రూ.1,500, 70-75గా ఉంటే రూ.వెయ్యి చెల్లించాలన్నారు. 60శాతం కంటే తక్కువ ఉన్న సైన్స్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఆర్ట్స్ విద్యార్థులను ప్రైవేట్‌గా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

News October 8, 2024

మోహినీ అవతారంలో ఊరేగిన శ్రీనివాసుడు

image

AP: తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం మోహినీ అవతారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇటు బ్రహ్మోత్సవాల్లో ఎంతో విశిష్ఠమైన గరుడ వాహన సేవ సాయంత్రం నిర్వహించనున్నారు. గరుడ వాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు మూడున్నర లక్షల మంది వస్తారని అంచనా. నిన్నటి నుంచే కొండపైకి ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.