News April 30, 2024

మా గొంతులు నీటితో తడపండి.. మద్యంతో కాదు!

image

AP: పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ‘మద్యంతో కాదు నీటితో మా గొంతులు తడపండి’ అనే సందేశాన్ని ఓటర్లు వైరల్ చేస్తున్నారు. ‘నాయకులారా. మీకు ఓట్లు కావాలంటే.. మాకు నీళ్లు కావాలి. మా పంటలు పండితేనే.. మీకు ఓట్లు రాలుతాయి’ అంటూ పల్నాడు జిల్లా గుమ్మనంపాడు వాసులు దీన్ని షేర్ చేస్తున్నారు. తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారమే తమ డిమాండ్ అంటూ పార్టీల అభ్యర్థులకు ఈ సందేశం చేరేలా వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారు.

Similar News

News March 16, 2026

సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్మెంట్

image

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇతను కెరీర్‌లో 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20లు ఆడారు. 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 రన్స్ చేశారు. వికెట్ కీపర్‌గా 315 క్యాచ్‌లు పట్టారు. కెప్టెన్‌గా 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. U-19 సారథిగా 2006లో వరల్డ్ కప్ సాధించారు.

News March 16, 2026

‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

image

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.

News March 16, 2026

అంగన్వాడీలకు శుభవార్త

image

APలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర సంస్థ EESL వెల్లడించింది. తొలి దశలో 11,400 పంపిణీ చేశామని, మరో 44,346 కేంద్రాలకూ త్వరలోనే అందిస్తామని తెలిపింది. దీనివల్ల LPG వినియోగం తగ్గి ఏటా రూ.24 కోట్ల వరకు ఆదా అవుతుందని, 28వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని పేర్కొంది. అగ్నిప్రమాదాలు ఉండవని, సిబ్బంది సురక్షితంగా వంట చేసుకోవచ్చని వివరించింది.