News November 26, 2024
‘జీబ్రా’కు అలా జరగకూడదని కోరుకుంటున్నా: సత్యదేవ్

‘జీబ్రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ఎమోషనల్ పోస్టు చేశారు. ‘ఇది మీరు ఇచ్చిన విజయం. థియేట్రికల్ హిట్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూశా. నేను హిట్ కొడితే మీరు కొట్టినట్లే ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాను మీరు థియేటర్‌లో మిస్సై తర్వాత OTT, యూట్యూబ్‌లో చూసి ప్రశంసలు కురిపించారు. జీబ్రాకు అలా జరగకూడదు. దయచేసి మూవీని థియేటర్లలో చూడండి’ అని రాసుకొచ్చారు.
Similar News
News April 13, 2026
పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.
News April 13, 2026
రేపు CBSE టెన్త్ ఫలితాలు?

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇవాళ సాయంత్రంలోపు బోర్డు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. https://www.cbse.gov.in/లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి-మార్చిలో జరిగిన ఈ ఎగ్జామ్స్‌కు దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి.
News April 13, 2026
ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.


