News February 21, 2025
సంకల్పంతో కళ్లు లేకున్నా కలెక్టర్‌గా..!

మహారాష్ట్రకు చెందిన ప్రాంజల్ పాటిల్ ఇండియాలో మొట్ట మొదటి దృష్టిలోపం ఉన్న మహిళా IAS. చిన్నప్పుడే చూపు కోల్పోయినా బ్రెయిలీ, స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీతో చదువుకున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పీజీ చేసి UPSCకి ప్రిపేర్ అయ్యారు. తొలి ప్రయత్నంలోనే 2016లో రైల్వే(IRAS)లో ఉద్యోగం సాధించినప్పటికీ వైకల్యం కారణంగా తిరస్కరణకు గురయ్యారు. 2017లో 124వ ర్యాంకు సాధించి IASకు ఎంపికై ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.
Similar News
News March 19, 2025
వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా

AP: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు(పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ) రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర MLA అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.
News March 19, 2025
సన్న వడ్లకు రూ.500 బోనస్‌పై UPDATE

TG: సన్న రకం వడ్లకు రూ.500 బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానకాలం పంటకు సంబంధించి రూ.1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
News March 19, 2025
IPLలో పర్పుల్ క్యాప్ హోల్డర్స్

*2008- సోహైల్ తన్వీర్ *2009- ఆర్పీ సింగ్
*2010- ప్రజ్ఞాన్ ఓఝా *2011- లసిత్ మలింగ
*2012- మోర్నే మోర్కెల్ *2013- డ్వేన్ బ్రావో
*2014- మోహిత్ శర్మ *2015- డ్వేన్ బ్రావో
*2016, 17- భువనేశ్వర్ కుమార్ *2018- ఆండ్రూ టై
*2019- ఇమ్రాన్ తాహిర్ *2020- కగిసో రబాడ
*2021- హర్షల్ పటేల్ *2022- యుజువేంద్ర చాహల్
*2023- మహమ్మద్ షమీ *2024- హర్షల్ పటేల్
*2025- ?