News June 5, 2024

నా ప్రియమైన సోదరుడితో..: స్టాలిన్

image

ఈ రోజు ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ Xలో ఓ స్పెషల్ ఫొటో పంచుకున్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. ‘నా ప్రియమైన సోదరుడితో..’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా డీఎంకేకు పార్లమెంటు ఎన్నికల్లో 22 సీట్లు వచ్చాయి.

Similar News

News October 8, 2024

OFFICIAL: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఎవ‌రికి ఎన్ని సీట్లు?

image

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఓట్ల లెక్కింపు ముగిసింది. ప‌దేళ్ల త‌రువాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌-కాంగ్రెస్-సీపీఎం కూట‌మి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్సీ 42, కాంగ్రెస్ 6, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి. 90 స్థానాలున్న అసెంబ్లీలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను కూటమి పార్టీలు చేరుకున్నాయి. ఇక BJP 29 స్థానాల్లో, పీడీపీ 3, జేపీసీ, ఆప్ చెరో స్థానంలో గెలుపొందాయి.

News October 8, 2024

నేరం రుజువైతే సురేఖపై కోర్టు చర్యలు: నాగార్జున లాయర్

image

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్, పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఇవాళ నాగార్జునతో పాటు మొదటి సాక్షిగా సుప్రియ వాంగ్మూలం రికార్డు చేశారని, ఈనెల 10న మరో సాక్షి వాంగ్మూలం తీసుకుంటారని చెప్పారు. నేరం రుజువైతే సురేఖపై కోర్టు చర్యలు తీసుకుంటుందని, ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.

News October 8, 2024

కాంగ్రెస్‌తో పొత్తు ఎన్సీకి క‌లిసొచ్చింది

image

JKలో కాంగ్రెస్‌తో పొత్తు NCకి క‌లిసొచ్చింది. ఆర్టిక‌ల్ 370 స‌హా రాష్ట్ర హోదా పున‌రుద్ధ‌రణపై ప్ర‌జ‌ల‌కు NC హామీ ఇచ్చింది. ఈ హామీల అమ‌లు స్థానిక ప్ర‌భుత్వ ప‌రిధిలో లేని అంశాలు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ఎప్ప‌టికైనా NC వీటిని అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని ప్రజలు భావించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కశ్మీర్‌లో కూటమి మెజారిటీ సాధించింది. అయితే, ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కాంగ్రెస్ ఎన్నడూ స్పందించలేదు.