News August 7, 2024

రష్యా గైర్హాజరీతో US, చైనాకు పతకాల పండగ!

image

పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా (86), చైనా (59) పతకాల పండగ చేసుకుంటున్నాయి. రష్యా పోటీలో లేకపోవడంతో ఈ 2 దేశాలకు ఎదురే లేకుండా పోయింది. యుద్ధం కారణంగా IOC రష్యాపై బ్యాన్ విధించింది. దీంతో ఆ దేశం నుంచి 15 మంది మాత్రమే పారిస్ ఒలింపిక్స్‌లో తటస్థ జెండాతో పాల్గొన్నారు. అదే టోక్యో ఒలింపిక్స్‌లో 330 మంది పోటీపడ్డారు. ప్రస్తుతం రష్యా స్టార్ అథ్లెట్లు ఎవరూ లేకపోవడంతో ఈ రెండు దేశాలు పతకాల వేటలో ముందున్నాయి.

Similar News

News September 11, 2024

20 కి.మీ వరకూ నో టోల్.. ఇలా!

image

జాతీయ రహదారులపై 20 కి.మీ. వరకూ ఎలాంటి <<14068203>>టోల్<<>> ఛార్జీ లేకుండా ఉచితంగా వెళ్లొచ్చు. 20 కి.మీ దాటాక ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనదారులు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకోవాల్సి ఉంటుంది. టోల్ రోడ్డుపై వాహనం ఎంత దూరం ప్రయాణించిందో ఆన్ బోర్డ్ యూనిట్ల ద్వారా జీపీఎస్ కోఆర్డినేట్లు రికార్డు అవుతాయి. దీంతో టోల్ ఛార్జీ నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.

News September 11, 2024

ఈ క్రికెటర్ ఎవరో చెప్పుకోండి చూద్దాం!

image

క్రికెట్ ప్రేమికులకో పజిల్. పై ఫొటోలో ఓ లెజెండరీ బౌలర్ ఉన్నారు. వన్డేల్లో 300కి పైగా మెయిడిన్ ఓవర్లు వేసిన ఒకే ఒక క్రికెటర్ అతడు. వందకు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు, 13 ఐపీఎల్ మ్యాచులు ఆడారు. IPLలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆ లెజెండరీ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి.
**సరైన సమాధానం మ.ఒంటి గంటకు ఇదే ఆర్టికల్‌లో చూడండి.

News September 11, 2024

నాపై అత్యాచారం చేశాడు: IAF ఆఫీసర్‌పై మహిళ ఫిర్యాదు

image

వింగ్ కమాండర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఎయిర్‌ఫోర్స్ ఫ్లైయింగ్ అధికారిణి జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది బర్త్ డే పార్టీ పేరుతో తనను ఇంటికి పిలిచి లైంగిక దాడి చేశాడని తెలిపారు. అతడితో కలిసి విధులు నిర్వర్తించలేనని, తనను వేరే చోటకు బదిలీ చేయాలని కోరారు. కొద్ది రోజులుగా తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు.