News April 4, 2025
WNP: ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం దరఖాస్తులు

ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఏప్రిల్ 10వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల వారిగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్(క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), ట్రేడ్స్మెన్ పదో తరగతి పాస్, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ (ఎనిమిదో తరగతి పాస్) ఉత్తీర్ణత ఉండాలన్నారు. #SHARE IT.
Similar News
News April 11, 2025
PHOTO: ధోనీ నాటౌట్?

సీఎస్కే కెప్టెన్ ధోనీ ఔట్ చర్చనీయాంశంగా మారింది. నరైన్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చారు. ధోనీ రివ్యూ కోరగా రీప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. అయితే రీప్లేలో బంతి బ్యాటు పక్క నుంచి వెళ్తున్న క్రమంలో అల్ట్రాఎడ్జ్‌లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నట్లు వీడియోలో కనిపించాయి. దీంతో క్లియర్ ఎడ్జ్ అయిందని, ఆయన నాటౌట్ అని పలువురు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు?
News April 11, 2025
గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు మిగతా ఐదుగురు నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో మాధవ్ సహా ఇతర నిందితులను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
తిరుపతి ప్రజలకు గమనిక

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులను చెల్లిస్తే 50 శాతం వడ్డీ మినహాయింపు ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం తెలిపారు. 2024-25 సంవత్సరంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఏప్రిల్ 30వ తేదీలోపు ఒకేసారి చెల్లిస్తే ప్రస్తుతమున్న వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బకాయిదారులు వినియోగించుకోవాలని కోరారు.