News September 22, 2024

మహిళను 30 ముక్కలుగా నరికి..

image

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఇంట్లో 29 ఏళ్ల మహిళను హత్య చేసి 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచారు. 4-5 రోజుల క్రితం ఈ మర్డర్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన మహాలక్ష్మి (29) భర్త హేమంత్‌తో విడిపోయి ఒంటరిగా ఉంటోందని పోలీసులు తెలిపారు. అయితే కొన్ని రోజులుగా ఆమెను పికప్, డ్రాప్ చేసేందుకు ఓ యువకుడు వచ్చే వాడని, అతడే ఈ హత్య చేసి ఉండొచ్చని ఏసీపీ తెలిపారు.

Similar News

News October 7, 2024

అమెరికాలో 227కు చేరిన హెలీన్ హరికేన్ మృతులు

image

అమెరికాలో హెలీన్ పెను తుఫాను గత నెలాఖరులో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో కలిపి 227 మృతదేహాల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ-4 తీవ్రతతో విరుచుకుపడిన హెలీన్ తన దారిలో ఉన్న ప్రతి దాన్నీ ధ్వంసం చేసింది. 2005లో వచ్చిన కత్రీనా తుఫాను తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేశారు.

News October 7, 2024

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?

image

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే హోంమంత్రి సమావేశంలో వీరిద్దరూ పాల్గొంటారు. అనంతరం వీరిరువురూ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్తారు.

News October 7, 2024

భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్

image

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్‌లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.