News August 28, 2024
మహిళలు బలహీనులన్న మనస్తత్వంపై పోరాడాలి: రాష్ట్రపతి
స్త్రీలపై నేరాల విపరీతత్వం నుంచి భారత్ మేల్కోవాల్సిన సమయం వచ్చేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. మహిళలు బలహీనులు, తక్కువ తెలివైనవారు, తక్కువ సామర్థ్యం గల వారన్న మనస్తత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. అలాంటి అభిప్రాయాలు పంచుకొనేవారు ఇంకా ముందుకెళ్లి మహిళలను వస్తువుల్లా చూస్తారని పేర్కొన్నారు. మన కూతుళ్లు భయం నుంచి స్వేచ్ఛను పొందే మార్గంలో అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
Similar News
News September 12, 2024
ఒకే టీమ్‌లో కోహ్లీ, బాబర్ అజామ్?
త్వరలో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కలిసి ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్రో-ఆసియా కప్‌ను ICC తిరిగి పునరుద్ధరించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆసియా జట్టు తరఫున కోహ్లీ, రోహిత్, బాబర్, బుమ్రా, అఫ్రీది, రిజ్వాన్ వంటి ఆటగాళ్లు కలిసి ఆడనున్నారు. గతంలో ఆసియా జట్టులో సెహ్వాగ్, అఫ్రీది, సంగక్కర, జయవర్ధనే, ఇంజమామ్, నెహ్రా, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్ కలిసి ఆడారు.
News September 12, 2024
‘కాంచన 4’లో పూజా హెగ్డే?
హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న ‘కాంచన 4’ మూవీలో పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కాంచన సిరీస్‌లో ఇప్పటికే ముని, కాంచన 2, గంగా చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం తెరకెక్కబోయే కాంచన 4ను రూ.100 కోట్ల బడ్జెట్‌తో గోల్డ్ మైన్ మూవీస్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
News September 12, 2024
శరవేగంగా వారణాసి స్టేడియం పనులు
వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రూ.441 కోట్ల అంచనా వ్యయంతో ఈ మైదానాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 7 పిచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 30 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఢమరుకం, త్రిశూలం ఆకారాలతో అడుగడుగునా శివతత్వం ఉట్టిపడేలా BCCI, UPCA దీనిని నిర్మిస్తున్నాయి.