News February 5, 2025
మహిళలూ.. ఇది మీకోసమే!

చాలా మంది మహిళలు మేకప్ వేసుకున్న తర్వాత బ్రష్‌ను అలానే వదిలేసి, కొద్ది రోజుల తర్వాత దాన్నే వాడుతుంటారు. అయితే, ఇది ఎంతో ప్రమాదకరమని, టాయిలెట్ సీటు కంటే శుభ్రపరచని మేకప్ బ్రష్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ బ్రష్‌ను వాడటం వల్ల మొటిమలు, చికాకు వంటి సమస్యలొస్తాయని తేలింది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మేకప్ బ్రష్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
Similar News
News March 5, 2026
ఇరాన్‌పై దాడులు.. US కాంగ్రెస్‌లో ట్రంప్‌కు ఊరట

ఇరాన్‌పై దాడులతో రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ దేశ కాంగ్రెస్‌లో ఊరట లభించింది. ఈ సైనిక చర్యలపై ట్రంప్ అధికారాన్ని పరిమితం చేయాలన్న తీర్మానాన్ని US సెనేట్ (ఉన్నత సభ) తిరస్కరించింది. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ నుంచి ఒకరు, ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ నుంచి మరొకరు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఓటింగ్‌లో స్వల్ప తేడాతో (53-47) రిజెక్ట్ అయింది.
News March 5, 2026
బాలకృష్ణ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్?

గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటించే ఛాన్సుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల ‘మిరాయ్’లో మనోజ్ విలన్‌గా నటించి మెప్పించారు. కాగా గతంలో మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో బాలయ్య ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
News March 5, 2026
‘పంచాయతీ’ నిధులపై సీతక్క కీలక ఆదేశాలు

TG: పంచాయతీల్లో బిల్లుల చెల్లింపు <<19293089>>వివాదంపై<<>> మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద 2023-24 ఏడాదికిగానూ టైడ్ కాంపొనెంట్ ద్వారా రూ.245 కోట్లు విడుదల చేసిందన్నారు.. వీటితో చేపట్టిన తాగునీరు, పారిశుద్ధ్య పనులకు మాత్రమే గత సర్పంచులకు బిల్లులు చెల్లించవచ్చన్నారు. అలాగే పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధుల నుంచి మల్టీ పర్పస్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని సూచించారు.


