News June 25, 2024
మహిళల ఆసియా కప్ షెడ్యూల్ విడుదల

మహిళల ఆసియా కప్-2024 షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్, గ్రూపు-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్ లాండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల్లో టాప్-2గా నిలిచిన జట్లు సెమీస్ చేరనున్నాయి. జులై 19న పాక్, 21న UAE, 23న నేపాల్ జట్లతో భారత్ తలపడనుంది. 26న సెమీఫైనల్ మ్యాచులు, 28న ఫైనల్ జరగనుంది.
Similar News
News November 18, 2025
‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్కౌంటర్లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.

వందల మంది మృతికి హిడ్మానే కారణం!

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి