News March 8, 2025
స్టార్టప్‌లలోనూ నారీ శక్తి

రాజకీయ, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా ధైర్యంగా స్టార్టప్ కంపెనీల నిర్వహణలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. రిటైల్, ఎడ్‌టెక్, ఈకామర్స్, ఫ్యాషన్ తదితర రంగాల్లో సంస్థలను వృద్ధి చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దేశంలో నారీమణుల సారథ్యంలో 7వేలకు పైగా అంకుర సంస్థలున్నాయి. మొత్తం స్టార్టప్‌లలో వీటి వాటా 7.5 శాతం. ఇవి ఇప్పటి వరకు $26 బిలియన్లను సమీకరించినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
Similar News
News March 16, 2025
ట్విటర్లో గ్రోక్ హల్‌చల్.. మీమ్స్ వైరల్

ట్విటర్ తీసుకొచ్చిన గ్రోక్ AI గురించి నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. నిజమైన మనిషి తెలుగును ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే ఎలా ఉంటుందో అదే తరహాలో భాషలో ఎటువంటి తప్పులూ లేకుండా గ్రోక్ జవాబులిస్తోంది. ఆఖరికి బూతులు కూడా నేర్చుకుని, తిట్టిన వారిని తిరిగి తిడుతుండటంతో ట్విటర్ జనాలు జోకులు పేలుస్తున్నారు. ఫ్యాన్ వార్స్‌లోనూ గ్రోక్‌ను ఇన్వాల్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా భాషల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.
News March 16, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం బ్రేక్

AP: కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది. ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని, తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని (35వేల క్యూసెక్కులు) తరలించేలా ఈ ఎత్తిపోతల పథకం చేపట్టారు. అనుమతులు నిరాకరించడంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ హర్షం వ్యక్తం చేశారు.
News March 16, 2025
GOOD NEWS: వారికి ఉచితంగా బస్సు

AP: రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లిష్ మీడియం, NCERT సిలబస్‌తో వచ్చే నెల 1వరకూ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. హాల్ టికెట్ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.