News August 5, 2024

మహిళల T20 వరల్డ్ కప్‌పై నీలినీడలు!

image

బంగ్లాదేశ్‌లో ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకోవడం, సైనిక పాలనతో ఆ దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో అక్టోబర్ నుంచి ఆ దేశంలో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీని వేరే దేశానికి తరలించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వరల్డ్ కప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 6, 2025

గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫాక్చర్ హబ్‌గా ఇండియా

image

రక్షణ ఉత్పత్తుల తయారీలో గ్లోబల్ హబ్‌గా భారత్ ముందడుగు వేస్తోంది. 2029లో ₹3Tల మేర ఉత్పత్తి చేయడంతో పాటు ₹50,000 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇండియన్ ARMY, NAVY, AIRFORCEకు సంబంధించిన ₹670 Bల ప్రపోజల్‌ను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది. FY27లో రక్షణరంగ బడ్జెట్‌ 20% మేర పెరగవచ్చని ఇప్పటికే రక్షణ శాఖ సంకేతాలు పంపింది. దీంతో రక్షణ ఉత్పత్తులు ఊపందుకోనున్నాయి.

News December 6, 2025

టాస్ గెలిచిన భారత్

image

విశాఖలో సౌతాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 వన్డేల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలవడం విశేషం. సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు.

భారత్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), తిలక్ వర్మ, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

News December 6, 2025

4,116 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

RRC నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. టెన్త్, ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.rrcnr.org