News August 20, 2024
యూఏఈలో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ యూఏఈలో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌లో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఇటీవల బంగ్లాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ వేదికను మార్చింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈలోని దుబాయ్, షార్జా స్టేడియాల్లో WC మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27 నుంచి వార్మప్ మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి.
Similar News
News January 23, 2025
BIG NEWS.. రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో అమెజాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడిపై ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ సంస్థ MOU చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది. అటు నిన్న ఒక్కరోజే రూ.56వేల కోట్లకుపైగా పెట్టుబడులపై పలు సంస్థలతో ప్రభుత్వం <<15232469>>ఒప్పందం <<>>కుదుర్చుకుంది.
News January 23, 2025
ఎయిర్‌పోర్టులో ఇంత తక్కువ ధరలా!
విమానాశ్రయాల్లోని కేఫ్‌లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని కేఫ్‌లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్‌పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో సమస్యను లేవనెత్తారు.
News January 23, 2025
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ
హైదరాబాద్ పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు అంగీకరిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపట్టనుండగా, దీని ద్వారా 17వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీలో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో సంగ్రాజ్ ఈ మేరకు వెల్లడించారు.