News November 17, 2024
ఓడినా గెలిచాను: మైక్ టైసన్
జేక్ పాల్తో నిన్న జరిగిన బాక్సింగ్ మ్యాచ్లో తాను ఓడినప్పటికీ గెలిచినట్లేనని దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ట్వీట్ చేశారు. ‘ఆడినందుకు, ఓడినందుకు నాకు ఏమాత్రం బాధ లేదు. జూన్లో చావు అంచుల వరకూ వెళ్లాను. 8సార్లు రక్తం మార్చారు. సగం రక్తాన్ని కోల్పోయాను. మళ్లీ ఆరోగ్యవంతుడైనప్పుడే నేను గెలిచాను. నాకంటే సగం వయసున్న ఫైటర్తో 8 రౌండ్లు పోరాడి నిలబడటాన్ని నా బిడ్డలు చూశారు. నాకు అదే చాలు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2024
రోహిత్ వెంటనే ఆసీస్ వెళ్లాలి: గంగూలీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియా వెళ్లాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ‘రోహిత్ అద్భుతమైన కెప్టెన్. ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత జట్టుకు అతడి లీడర్షిప్ అవసరం. రోహిత్ భార్య ఇప్పటికే బిడ్డకు జన్మనిచ్చారు కాబట్టి అతడు వెళ్లి పెర్త్ టెస్ట్ ఆడాలి’ అని సూచించారు. ఈ సిరీస్ తర్వాత రోహిత్ మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లకపోవచ్చని గంగూలీ వ్యాఖ్యానించారు.
News November 17, 2024
క్రిమినల్పై ‘పావలా’ రివార్డు
నేరస్థులు, మావోలు, సంఘవిద్రోహ శక్తులను పట్టుకునేందుకు వారిస్థాయిని బట్టి పోలీసులు రివార్డులు ప్రకటించడం సహజం. అయితే రాజస్థాన్లోని లఖన్పుర్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఖుబీరామ్ జాట్(48) అనే క్రిమినల్పై కేవలం పావలా రివార్డు ప్రకటించారు. నేరస్థుల స్థాయిని తక్కువ చేసి చూపడం, వారు కోరుకునే గుర్తింపును దక్కకుండా చేయడం కోసమే పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది.
News November 17, 2024
2,050 ప్రభుత్వ ఉద్యోగాలు.. 23న పరీక్ష
TG: రాష్ట్రంలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 23న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. హాల్టికెట్లను <