News August 2, 2024
నిరుద్యోగులను రెచ్చగొట్టి గెలిచారు: కేటీఆర్
TG: నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య చెప్పకుండా మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, ఆ ఉద్యోగాలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ప్రజలు తంతారనే భయంతో జాబ్ క్యాలెండర్ పేరుతో ఓ కాగితాన్ని సభలో ప్రవేశపెట్టారని విమర్శించారు.
Similar News
News September 20, 2024
రాజకీయాల నుంచి ఆలయాలకు స్వేచ్ఛ ఇవ్వాలా?
తిరుపతి లడ్డూ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ రాజకీయ విమర్శలతో ఆలయాలకు స్వేచ్ఛ అవసరమనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల నియంత్రణ నుంచి ఆలయాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని భక్తులు, నెటిజన్లు కోరుతున్నారు. కోట్ల మంది మనోభావాలు, నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిన ఆలయాలకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 20, 2024
అమెరికా పిల్లల్లో వింత వైరస్ వ్యాప్తి
అమెరికాలో ఓ కొత్త వైరస్ పిల్లలపై దాడి చేస్తోంది. శ్వాసకోసపై దాడి చేసి వారిలో పోలియో తరహాలో పక్షవాతాన్ని కలుగజేస్తోందని అక్కడి పరిశోధకులు తెలిపారు. చిన్నారుల్లో నరాల సంబంధిత సమస్యల్ని తీసుకొచ్చే ఎంటెరోవైరస్ డీ68 స్ట్రెయిన్‌ను దేశవ్యాప్తంగా మురుగునీటిలో గుర్తించినట్లు వెల్లడించారు. పిల్లల కాళ్లూచేతులు చచ్చుబడిపోతున్నాయని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
News September 19, 2024
పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త
AP: అర్హులకు పెన్షన్లు అందేలా చూసేందుకు త్వరలోనే సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెర్ప్‌పై CM చంద్రబాబుతో సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడారు. ‘పెన్షన్లు అందని వారికి పెన్షన్లు ఇస్తాం. 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసే అంశంపై చర్చించాం. 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారు 15 లక్షల మంది ఉన్నారు. త్వరలోనే వారికి పెన్షన్లు ఇవ్వడంపై మార్గదర్శకాలు రూపొందిస్తాం’ అని మంత్రి చెప్పారు.