News April 4, 2025
స్టార్టప్స్‌కు ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ పనికిరాదు: లింక్డిన్ కోఫౌండర్

లింక్డిన్ కోఫౌండర్ హాఫ్‌మన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టార్టప్ కంపెనీలకు ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ పనికిరాదన్నారు. ఎవరైనా ఆ మాట చెబితే వారికి స్టార్టప్ గురించి అవగాహన లేనట్లేనని చెప్పారు. అంకుర సంస్థలు సక్సెస్ అవ్వాలంటే ఉద్యోగులు నిరంతరం పనిచేయాల్సిందేనన్నారు. ‘ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో డిన్నర్ చేసి మళ్లీ పని మొదలుపెట్టండి’ అని లింక్డిన్ స్థాపించిన కొత్తలో ఉద్యోగులకు చెప్పేవాళ్లమని వెల్లడించారు.
Similar News
News September 12, 2025
ఎయిర్‌టెల్ డౌన్.. కస్టమర్ల ఫైర్

ఎయిర్‌టెల్ కస్టమర్లు నెట్‌వర్క్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజులుగా సరిగా సిగ్నల్స్ రావడం లేదని వాపోతున్నారు. మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నెట్ కూడా పనిచేయడం లేదంటున్నారు. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. SMలో తమ అసంతృప్తిని తెలియజేస్తూ ‘#AirtelDown, #BanAirtel’ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. మీకూ నెట్‌వర్క్ సమస్య ఎదురవుతోందా?
News September 12, 2025
బజరంగ్ పునియా తండ్రి కన్నుమూత

భారత రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత బజరంగ్ పునియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి బల్వాన్ పునియా ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో గత 18 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు తన తండ్రి చాలా కష్టపడ్డారని, కుటుంబానికి ఆయనే వెన్నెముక అని బజరంగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
News September 12, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాబోయే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇవాళ ప.గో, ఏలూరు, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, NLR, KNL, నంద్యాల, ATP, కడప, TPT జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. అటు TGలో NML, NZB, HYD, మేడ్చల్, MBNR, NGKL, NRPT, వనపర్తి, మహబూబాబాద్, SRPT, JGL, SRCL, వికారాబాద్, కామారెడ్డి, గద్వాల్, NLG జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.