News November 2, 2024

ఎత్తైన గాంధీ విగ్రహ ఏర్పాటుపై కసరత్తు

image

TG: సీఎం రేవంత్ ఆదేశాలతో HYD బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభమైనట్లు CMO వెల్లడించింది. ‘పట్నాలో 72 అడుగుల గాంధీ కాంస్య విగ్రహం ఉంది. గుజరాత్‌లో వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహ ఎత్తు 182 మీటర్లు. దీనికంటే ఎత్తయిన విగ్రహాన్ని ఎలా నిర్మించాలి? దండి మార్చ్‌కు కదిలినట్లు నిలబడి ఉండాలా? ధ్యాన ముద్రలో తయారుచేయించాలా? అనే దానిపై చర్చిస్తున్నాం’ అని పేర్కొంది.

Similar News

News December 11, 2024

రియాలిటీ షో కోసం రూ.118 కోట్లు ఖర్చు!

image

యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన మిస్టర్ బీస్ట్ కొత్త రియాలిటీ షో నిర్వహించనున్నారు. అమెజాన్‌తో కలిసి ఆయన ‘బీస్ట్ గేమ్స్’ పేరుతో కొత్త రియాలిటీ షో కోసం సెట్ నిర్మించేందుకు $14 మిలియన్స్ (రూ.118 కోట్లు) వెచ్చించినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. ఈ సిరీస్‌లో 10 ఎపిసోడ్స్ ఉంటాయని, విజేతకు 5 మిలియన్ డాలర్లు అందించనున్నట్లు సమాచారం. రియాలిటీ షోల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రైజ్ మనీగా నిలవనుంది.

News December 11, 2024

మా నాన్న దేవుడు: మనోజ్

image

TG: కుటుంబం కోసం ఎంతో కష్టపడి పనిచేశానని మంచు మనోజ్ తెలిపారు. ‘మా నాన్న నాకు దేవుడు. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన. వేరేవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అన్న విష్ణు, వినయ్.. నాన్నపై గన్ను పెట్టి కాలుస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా? అది నచ్చక కుట్ర చేస్తున్నారు. నేను, నా భార్య ఎవరి పనివారు చేసుకుంటున్నాం.’ అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.

News December 11, 2024

జర్నలిస్టుల ధర్నాకు మంచు మనోజ్ మద్దతు

image

సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. ‘మా నాన్న తరఫున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు’ అని ఆయన పేర్కొన్నారు.