News December 9, 2024

వారానికి నాలుగు రోజులే పని.. ఎక్కడంటే?

image

వారానికి నాలుగు రోజులే పనిచేసేలా కొత్త రూల్‌ను టోక్యో పరిచయం చేస్తోంది. పనిచేసే తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడం, దేశ సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జపాన్ జనాభా సంక్షోభం నేపథ్యంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌‌ను ఇంప్రూవ్ చేయడం, కుటుంబ వృద్ధిని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం. అయితే, ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ రూల్‌పై మీ అభిప్రాయం ఏంటి?

Similar News

News December 21, 2025

మహిళలకు స్మార్ట్ కిచెన్‌ల బాధ్యతలు!

image

AP: మహిళా స్వయం సహాయక సంఘాల(SHG)కు ప్రభుత్వం కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పక్కాగా అమలు చేసేందుకు వారికి స్మార్ట్ కిచెన్‌ల నిర్వహణను అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో పలు స్మార్ట్ కిచెన్‌లలో అన్ని పనులను పూర్తిగా మహిళలే పర్యవేక్షిస్తున్నారు. దీంతో త్వరలో మరిన్నింటిని మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

News December 21, 2025

బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర నిరసన.. క్లారిటీ ఇచ్చిన ఇండియా

image

ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర జరిగిన నిరసనలపై ఇండియా క్లారిటీ ఇచ్చింది. <<18624742>>దీపూ చంద్రదాస్<<>> హత్యను నిరసిస్తూ, బంగ్లాలో మైనారిటీల రక్షణ కోసం అక్కడ కొంతమంది నినదించారని విదేశాంగశాఖ తెలిపింది. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పింది. బంగ్లా మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంది. బంగ్లాలో మైనారిటీలపై దాడుల పట్ల ఇండియా తన ఆందోళనను అక్కడి అధికారులకు తెలియజేసింది.

News December 21, 2025

మనం అనుకుంటేనే..

image

ఏ బంధంలోనైనా మొదట్లో ఉండే ప్రేమ తర్వాత కనిపించదు. చిన్నప్పటి నుంచి ప్రతి అంశంలో నేను అనే భావన ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత ఆ భావనను క్రమంగా తగ్గించుకొని మనం అనుకోవాలి. సినిమా, షాపింగ్, స్నేహితులను కలవడానికి భాగస్వామితో కలిసి వెళ్లాలి. అప్పుడే దంపతుల మధ్య దూరం పెరగకుండా ఉంటుంది. పనులెన్నున్నా రోజూ కొంత సమయం జీవితభాగస్వామి కోసం వెచ్చించాలి. కష్ట సుఖాలే కాదు, అభిరుచులు, ఆసక్తి వంటివన్నీ పంచుకోవాలి.